Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీలో టీచింగ్ పోస్టులు - వేతనం రూ.లక్ష

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:23 IST)
ప్రఖ్యాత పుణ్యస్థలంగా తిరుపతి పట్టణంలో స్థాపించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ఫ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ డ్రైవ్ కింద అనేక విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ముఖ్యంగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గ్రేడ్-1. ఈ పోస్టు కోసం కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, గణితం మరియు స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి కనీసం మూడేళ్ళ టీచింగ్, పరిశోధన, ఇండస్ట్రియల్ అనుభవం ఉండాల్సి ఉంటుంది. అలాగే 38 యేళ్లకు మించకుండా ఉండాలి. 
 
అయితే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 38 యేళ్లకు మించకుండా ఉండాల్సి వుంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ ఎన్.సి.ఎల్ అభ్యర్థులకు మూడేళ్ళు, పీడబ్ల్యూడీలకు పదేళ్ళ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. దరఖాస్తులను వచ్చే నెల 24వ తేదీ లోపు పంపించాల్సివుంటుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు వేతనం లక్ష రూపాయలకు పైగా, ఇతర అలవెన్సులను కూడా ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments