Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
, సోమవారం, 25 అక్టోబరు 2021 (21:39 IST)
ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సోమ‌వారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షలో ప‌లు అంశాలు చ‌ర్చించారు. సీఎస్‌ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ అన్నది నిరంతరం కొనసాగాలి. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలి. అప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి. ఎడ్యుకేషనల్‌గా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటి అన్నది కనిపించాలి. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. జాబ్‌ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి.

ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాం. చదువులున్నా.. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి విఫల‌మ‌వుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి. ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకు వస్తున్నాం. సర్టిఫైడ్‌కోర్సులను కరికులమ్‌లో భాగంగా చేయాలి.

ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి. చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. యూనివర్శిటీల్లో టీచింగ్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయమని ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం. టీచింగ్ స్టాఫ్ లేనప్పుడు యూనివర్శిటీలు ఉన్నా.. లాభం ఏంటి. రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు. టీచింగ్‌స్టాఫ్‌లో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌చేసినా అర్థం ఉండదు. అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి.

అత్యంత పారదర్శకంగా నియమాకాలు సాగాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్‌కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలోకూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి. కాలేజీలన్నీ కూడా ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలి. ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో ఎక్కడా లోటు చేయడంలేదు.

ప్రతి మూడు నెలలకోసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంవల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాలనుంచి రాకుండా చూసుకుంటున్నాం. తల్లుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం. కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజురియింబర్స్‌మెంట్‌ఫీజులు కూడా ఇస్తాం.

ఇతర ప్రైవేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం. దీనివల్ల ఆర్థికంగా యూనివర్శిటీలు స్వయం స్వయంసమృద్ధి సాధిస్తాయి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ కావాలి. పరిశోధనలమీద కూడా కొలాబరేట్‌చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి. ఒక్కో యూనివర్శిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌కావాలి.

ప్రతి వారం ఒక వీసీని పిలిపించుకుని... యూనివర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చొని చర్చించాలి. ఆ సమావేశంలో గుర్తించినా అంశాలను నా దృష్టికి తీసుకురావాలి. తర్వాత యూనివర్శిటీ వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వచ్చే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించి మూడేళ్లలో విజన్‌ సాధించాలి.

అన్ని యూనివర్శిటీల్లో నాక్‌రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ కావాలి. ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌కోర్సులను ఉంచాలి. ఇంగ్లిషును మెరుగుపరచడంపైనా దృష్టిపెట్టాలి. బేసిక్‌ఇంగ్లీష్‌ అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలి. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.
 
వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్...
తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మాద్యమంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్న సీఎం.. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ అందించాలని తెలిపారు. ‘‘ఈ ప్రభుత్వం చదువకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య ఇవ్వడానికే అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం: నూత‌న డైరెక్టర్ల ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ఏపి టిడిసి చైర్మన్ వరప్రసాద్ రెడ్డి