దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఏ.వరప్రసాద్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు నూతనంగా నియమితులైన 12 మంది డైరెక్టర్లు విజయవాడ బెర్మ్ పార్క్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపి టూరిజం కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హోటళ్లు, రిస్సార్ట్ లు, బోటింగ్, కాన్ఫరెన్స్ హాల్స్‌లో పర్యాటకులకు ఆకర్షణీయమైన టూరిజం ప్యాకేజీలను అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆశయాలకు అనుగుణంగా టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్లు కృషి చేయాలని పేర్కొన్నారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టరు సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 13 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి 52 ఏర్పాటు చేసి 52 పడవలతో బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.
దిండి వద్ద రెండు హౌస్ బోట్లు, బొర్రాగుహలు, బెలం గుహలు, తదితర 5 ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించేలా అధునాతన సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో డైరెక్టర్లు కృషి చేయాలని ఆయన కోరారు.