Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక రాష్ట్రంలో ప్రజలకు దిక్కెవరు?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఇక రాష్ట్రంలో ప్రజలకు దిక్కెవరు?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:23 IST)
రాష్ట్రంలోహింస పేట్రేగిపోయిందని, ప్రభుత్వం పోలీసులసాయంతో ప్రజలపై దాడిచేస్తోందని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను అరికట్టండన కోరినపాపానికి ప్రజలు బలవతున్నారని, తెలంగాణ, తమిళనాడు పోలీసులు ఏపీలోకి వచ్చి, గంజాయిసాగుచేస్తున్న వారిపై దాడిచేస్తుంటే, ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, ప్రతిపక్షంపై ప్రజలపై దాడులకు తెగబడటం ఏమిటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...!

ఎవరు గంజాయి, మాదకద్రవ్యాలను గురించి ప్రశ్నిస్తే, విమర్శిస్తే, వారిని పోలీసులు లోపలేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాధి నేత.. కానీ ఆయనే నిన్న మాట్లాడుతూ, తనను తిట్టారుకాబట్టి, కొట్టండి.. చంపండి అనేపరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఐపీసీ చట్టం పూర్తిగా మారిపోయింది.  న్యాయంకోసం బాధితులు పోలీస్ స్టేషన్ల కువెళితే, వారినే పోలీసులు ముద్దాయిలుగా మారుస్తున్నారు.

బాధింపబడినవారిని, దెబ్బలుతిన్నవారినే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు..ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఇంతకముందెన్న డూ రాష్ట్రంలో లేదు. ఈ రెండు,మూడురోజుల్లో రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఆంధ్రుడైన ప్రతివ్యక్తి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. సాక్షాత్తూ టీడీపీకేంద్రకార్యాలయంపై దాడిజరిగితే దాడి చేసినవారిని అరెస్ట్ చేయకుండా, రక్షణకల్పించాలని కోరిన ఫిర్యాదు చేసిన టీడీపీనేతలపైనే తప్పుడుకేసులుపెట్టారు.

టీడీపీ నేతలు పట్టాభిరామ్, నాదెండ్ల బ్రహ్మాంలను అరెస్ట్ చేసిన పోలీసు లు, టీడీపీకార్యాలయంపైదాడిచేసిన వారిజోలికి మాత్రం పోమం టున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఏంజరుగుతోందో, దాడులుచేయ మని, హింసను పెంచమని ముఖ్యమంత్రే తనమాటల్లో చెప్పకనే చెప్పారు. డీజీపీ, ఎస్పీలసమావేశంలో ముఖ్యమంత్రే తనను తిట్టా రని ఏంచేస్తారో చేయండని అంటే ఎలా?

తిట్టారంటూ ప్రతిపక్షంపై దాడిచేస్తున్న ప్రభుత్వం, అధికారపార్టీ, టీడీపీకార్యాలయంపై దాడి చేసినవారిని  మాత్రం ఎందుకుపట్టుకోలేదు? టీడీపీకార్యాలయంపై దాడికి వచ్చినవారు స్వయంగా వైసీపీఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డి వాహనంలోనే వచ్చారు. అది మాపార్టీ కార్యాలయ సీసీకెమెరాల్లో రికార్డ్ అయింది. అయినా కూడా ఈ పోలీసులు లేళ్లఅప్పిరెడ్డిపై ఎలాంటిచర్యలు తీసుకోలేదు.

కనీసం ఆయన్ని ప్రశ్నించడానికి కూడా వెళ్లలేదు. భోజరాజు అనేవ్యక్తి టీడీపీకార్యాలయంపైకి దాడికి వచ్చాడు.. అతను ఇటీవలే గాంధీకోఆపరేటివ్ సొసైటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అతనితోపాటు, విజయవాడ 18వ డివిజన్ కార్పొరేటర్ అరవసత్యంకూడా టీడీపీకార్యాలయంపైకి దాడికివచ్చా డు. వైసీపీకార్పొరేటర్ స్వయంగా దాడికివస్తే, అతన్ని అరెస్ట్ చేసే దమ్ము,ధైర్యంపోలీసులకు లేవా?

లేక వారిని అరెస్ట్ చేయవద్దని ముఖ్యమంత్రే చెబుతున్నారా? వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యఅనుచరుడు పానుగంటి చైతన్య, తమపార్టీ కార్యాలయంలో కి వచ్చి నేరుగా మా సిబ్బందిపైనే దాడిచేస్తే,  ఆ దుర్మార్గం పోలీ సులకు కనిపించడంలేదా? అప్పిరెడ్డి మరో అనుచరుడు రోషన్ సాయి కూడా దాడిలో పాల్గొన్నాడు.

ఈ విధంగా పట్టపగలే టీడీపీ కార్యాలయంపైకి దాడికివచ్చినవారిని డీఎస్పీస్థాయి అధికారే దగ్గ రుండి వాహనాల్లో ఎక్కించి సాగనంపాడు. (డీఎస్పీ నిర్వాకాన్ని సోమిరెడ్డి గారు వీడియోరూపంలో విలేకరులకు ప్రదర్శించారు) దీనికేం సమాధానం చెబుతారో చెప్పండి. ఇవన్నీచూస్తుంటే రాష్ట్రం ఎక్కడికిపోతోందో తెలియడంలేదు. పోలీస్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎంతమాత్రంసమర్థనీయం కాదు.

మావోయిస్టులు నక్సలైట్లు మాట్లాడినట్టుగా మాట్లాడారు.  ప్రజలపై హింసను పోలీసులే ప్రోత్సహిస్తుంటే, ఇకసామాన్యులకు దిక్కెవరు? రాష్ట్రంలో సాగవుతున్న గంజాయిసాగుని తమిళనాడు తెలంగాణ పోలీసులు గుర్తించేవరకు ఇక్కడి పోలీసులు ఏంచేస్తు న్నారు? నిన్నటికి నిన్నహాడావుడిగా ఎక్కడోఒకచోట దాడిచేసి ఒక ఎకరానో, రెండెకరాల్లోని గంజాయినో తగలబెట్టారు.

మరి ఇన్నాళ్లనుంచి ఈ పోలీసులకు గంజాయిసాగు, రవాణా గురించి తెలియదా? ప్రతిపక్షం  బంద్ కు పిలుపునిస్తే, టీడీపీవారిని అరెస్ట్ చేస్తారా? వైసీపీవారికేమో ఎస్కార్ట్ గా నిలిచి, నిరసనలుచేయిస్తా రా? ఇంతదిగజారినందుకు పోలీస్ శాఖ సిగ్గుపడాలి. ప్రజలసొ మ్ముని జీతంగా తీసుకుంటూ, వైసీపీకి అనకూలంగా పనిచేస్తారా? ఏపీ పోలీస్ వ్యవస్థకంటే బీహార్, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్ పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది.

తమ కార్యాలయంపై దాడిచేసిన వారు పలానా అని చెబుతున్నా, డీజీపీ వారిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదు? జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ లేదు. దాడులు, అప్పులుచేయడం తప్ప, ఈ  ముఖ్యమంత్రికి ఏమీ తెలియడంలేదు? ప్రజలే ప్రభుత్వంపై, పాలకులపై తిరగబడేరోజు వచ్చింది. పరిస్థితి చేయి దాటకముందే పోలీస్ వ్యవస్థ టీడీపీ కార్యాలయంపై దాడిచేసినవారిని  పట్టుకొని శిక్షించాలి.

కార్యాలయంపై జరిగినదాడికి సంబంధించి తమపార్టీ నేతలు ఫిర్యాదుచేసినా, ఆధారాలుసమర్పించినా పోలీసులు ఎందుకు అసలు దోషులనుఅరెస్ట్  చేయలేదు? బాధితులు ఫిర్యాదు చేస్తే, దాడిచేసిన వారిని వదిలేసి, దాడికి గురైనవారినే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉం టుందా? గతంలోఎన్నోప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశాం.

కానీ ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి చేస్తున్నదారుణాలు ఎక్కడా లేవు. ఆఖరికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఆపి, కాంట్రాక్టర్లు చనిపోయేలా చేయడం ఈ ముఖ్యమంత్రికి చెల్లిందే. పాలకులు పాపాలు పండాయి.. అందుకే ప్రజలు సహనం కోల్పోయి తిరుబాటుకు సిద్ధమవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు: ఆరోగ్య శాఖ