Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంగార్డు పోస్టులు.. నెలకు రూ.2800 వేతనం.. పీజీ పట్టభద్రుల దరఖాస్తు

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:00 IST)
దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా, గతంలో ఎన్నడూ లేనంతగా 2017-18 సంవత్సరంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. ఈ సంవత్సరంలోనే నిరుద్యోగం 6.1 శాతానికి పెరిగినట్టు అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలను రుజువు చేసేలా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో స్వీపర్ పోస్టులకు బీటెక్, ఎంటెక్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, తాజాగా హోంగార్డు పోస్టులకు పీజీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో 56 హోం గార్డుల పోస్టులకు ఇటీవల దరఖాస్తులను ఉచితంగా ఇచ్చారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఈనెల 15వ తేదీలోపు సమర్పించాల్సి వుంది. ఇప్పటికే 6400 మంది నిరుద్యోగులు దరఖాస్తులు పూర్తి చేసి తిరిగి ఇచ్చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు విస్తుపోయారు. వీరిలో వందల మంది అభ్యర్థుల విద్యార్హత పీజీగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
ఇంతకీ ఈ హోంగార్డుకు ఇచ్చే నెలవేతనం కేవలం రూ.2800 మాత్రమే. అదీ కూడా నెలకు ఐదు రోజులు మాత్రమే పని కల్పిస్తారు. ఒక్కో రోజుకు రూ.560 చొప్పున వేతనం చెల్లిస్తారు. అయినప్పటికీ ఏదో ఒక ఉద్యోగం, ఎంతోకొంత వేతనం అన్న రీతిలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దండెత్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments