Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?

విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:07 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల విమానాల్లోనూ పలు వేధింపులు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా అలసిపోయిన కారణంగా అలా కాసేపు కునుకు తీసేసరికి.. విమానంలో పక్కనే కూర్చుని వున్న సహ ప్రయాణీకుడు.. ఓ పీజీ విద్యార్థినిని తాకరాని చోట తాకాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో చదువుకుంటున్న యువతి భోపాల్ నుంచి ఎస్టీ-1267 నెంబర్ గల స్పైస్ జెట్ విమానంలో హైదరాబాదుకు బయల్దేరింది. రాత్రి సరిగ్గా నిద్రలేకుండా, తెల్లవారుజామునే వచ్చి, ఉదయం 6 గంటల్లోపే విమానం ఎక్కిన ఆమె, అలసటతో కాస్తంత నిద్రపోగా, పక్కన కూర్చున్న మరో ప్రయాణికుడు వేధింపులకు దిగాడు.
 
వెంటనే లేచిన ఆమె, విమాన సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఎయిర్ పోర్టులో దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వద్ద దర్యాప్తు జరుపుతున్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో అసభ్యభంగిమలో మాజీ అందాల రాణి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మూతిపగులగొట్టాడు...