Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నకిలీ బాబా బాగోతం.. తాయత్తు కట్టాలంటే పూర్తిగా బట్టలు విప్పాలన్నాడు..

Advertiesment
నకిలీ బాబా బాగోతం.. తాయత్తు కట్టాలంటే పూర్తిగా బట్టలు విప్పాలన్నాడు..
, మంగళవారం, 29 జనవరి 2019 (15:13 IST)
ఈ మధ్యకాలంలో వీధికొక నకిలీ బాబాలు వెలుస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక బాబా చేసిన మోసం గురించి వార్తల్లో వస్తున్నప్పటికీ జనం మాత్రం అవేవీ పట్టించుకోకుండా వాళ్లను ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు.
 
తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో నకిలీ బాబా వెకిలి చేష్టలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే భర్తకు ఆరోగ్యం సరిగాలేదని ఒక మహిళ బిలాల్ బాబా అనే వ్యక్తి వద్దకు వెళ్లింది. ఆమె సమస్యలు తెలుసుకున్న బాబా ఆమె బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు.

దీని కోసం ఆమెకు, ఆమె భర్తకు తాయత్తులు కట్టాలని వారిని పిలిపించుకుని, భర్తకు ఏదో పొగ వేసి కొద్దిసేపు బయట వేచి ఉండమన్నాడు. ఆపై ఆ మహిళను గదిలోకి తీసుకెళ్లి తాయత్తు కట్టాలంటే పూర్తిగా బట్టలు విప్పాలని, లేకుంటే అది పని చేయదని చెప్పాడు.
 
బాబా మాటలకు ఖంగుతిన్న మహిళ అలా చేయడానికి నిరాకరించగా, ఆ బాబా లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీనితో అక్కడి నుండి వెళ్లిపోయిన మహిళ రెండు రోజుల వరకు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా కుమిలి పోయింది. చివరకు తన అత్త సహకారంతో పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి బాబాను అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?