Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 5న నీట్ ప్రవేశ పరీక్ష - జేఈఈ మెయిన్ పరీక్ష ఎపుడంటే...

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (11:33 IST)
జేఈఈ మెయిన్ షెడ్యూల్‌తో పాటు నీట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు తొలి విడత పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, నీట్ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో నీట్ పరీక్ష మినహా మిగిలిన అన్నీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగనున్నాయి. 
 
వచ్చే యేడాది జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష నిర్వహిస్తారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య జరుగుతాయి. ఆన్‌లైన్‌ పరీక్షల ఫలితాలను పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోపు వెల్లడించారు. వైద్య కాలేజీల్లో ప్రవేశాలకు వచ్చే యేడాది మే 5వ తేదీన నిర్వహించే నీట్ యూజీ 2024 ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తారు. తెలంగాణాలో ఇంటర్ పరీక్షల తేదీల వెల్లడించిన తర్వాత ఎంసెట్ తదితర పరీక్షలు తేదీలను వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. 
 
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్ల భర్తీ కోసం మార్చి 11 నుంచి 28వ మధ్య సీయూఈటీ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. యూజీ సీట్ల కోసం మే 15 నుంచి 31వ తేదీ మధ్య సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం జూన్ 10 నుంచి 21 మధ్య యూజీసీ నెట్ నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments