నిమ్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజెమెంట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (16:46 IST)
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) సోమవారం తన రెండేళ్ల మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (MHM) ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్లను ప్రకటించింది. నిమ్స్‌లో 20 సీట్లు ఉన్న ఎంహెచ్ఎం ప్రోగ్రామ్, గ్రాడ్యుయేట్లకు ఆసుపత్రి పరిపాలన-ఆరోగ్య సంరక్షణ సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందిస్తుందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
 
కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు 20 -30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూలై 28. ఇంకా ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి వుంటుంది. 
 
ఇంకా హార్డ్ కాపీ దరఖాస్తు సమర్పణకు కూడా చివరి తేదీ జూలై 2, 2025 (సాయంత్రం5 గంటలలోపు). దరఖాస్తు ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అవసరమైన పత్రాలతో పాటు హార్డ్ కాపీని సమర్పించడం జరుగుతుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 5,000 రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 4,000 వర్తిస్తుంది.
 
ఎంపిక ప్రవేశ పరీక్షలో అభ్యర్థి పనితీరు ఆధారంగా ఉంటుంది. ఫీజు నిర్మాణంలో ఒకేసారి ప్రవేశ రుసుము రూ. 5,000, తిరిగి చెల్లించదగిన సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1,000, సెమిస్టర్ ట్యూషన్ ఫీజు రూ. 26,250 ఉంటాయి. అదనపు వివరాలకు ఈ ఫోన్ నెంబర్: 040-23489189 లేదా nimsadat@gmail.com అనే ఈ-మెయిల్‌ను సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments