Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (12:44 IST)
దేశ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 290 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఇతర దేశాల్లోని 18 నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని బీటెక్ ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24, 25, 29, 30, 31వ తేదీల్లో పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు. అలాగే, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 28వ తేదీ పేపర్-2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 24వ తేదీన పరీక్ష రాసే వారు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. 
 
ఇకపోతే, ఏప్రిల్ 8వ తేదీ నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడత పరీక్ష కోసం వచ్చే నెల 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాల్సివుంటుంది. రెండు విడుతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయిస్తారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. అలాగే, ఈ దఫా తెలుగుతో పాటు ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచిన వారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4వతేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments