Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ - పరీక్షలు ఎప్పటి నుంచంటే...

national testing agency
, శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:31 IST)
జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఈ షెడ్యూల్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 24-31వ తేదీల మధ్య నిర్వహిస్తారు. 26వ తేదీన రిపబ్లిక్ డే కావడంతో ఆ రోజున మాత్రం ఈ ప్రవేశ పరీక్ష ఉండదు.
 
ఈ పరీక్షకు గురువారం నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. 
 
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఎన్.టి.ఏతెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 202-2022 సంవత్సరాలుల్ 12వ తరగతి లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు ఈ పరీక్షలను రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆర్థికవ్యవస్థ: ‘‘జీతాలు పెరగలేదు.. అద్దెలు, ధరలు, చార్జీలు అన్నీ పెరిగిపోయాయి.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’