Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (08:23 IST)
దేశంలోని ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి, ఎన్.ఐ.టీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష) తొలి విడద ప్రవేశ పరీక్ష నేటి నుంచి ప్రారంభంకానుంది. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా అనేక లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్క తెలంగాణా నుంచే 50 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మరోవైపు, జేఈఈ మెయి‌న్‌కు హాజ‌రయ్యే విద్యా‌ర్థు‌లను సొంత మాస్క్‌తో పరీక్ష కేంద్రా‌ల్లోకి అను‌మ‌తించేది లేదని అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లో ఉచి‌తంగా మాస్క్‌ను అందిస్తామన్నారు. గత యేడాది మాస్క్‌ను ధరించి ఒక‌రికి బదు‌లుగా ఒకరు పరీక్ష రాస్తూ పట్టు‌బ‌డిన నేపథ్యంలో ఎ‌న్టీఏ ఈ జాగ్రత్త తీసు‌కుంది.
 
విద్యా‌ర్థులు తమ వెంట 2 పాస్‌‌పోర్ట్‌ సైజు ఫొటో‌లను తీసు‌కురావాలని, వాటిని ఏదేని ఐడీ ఫ్రూఫ్‌తో సరి‌పో‌ల్చి చూస్తామని అధికారులు తెలిపారు. గుర్తింపు కార్డు‌లుగా ఒరి‌జి‌నల్‌ పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌‌పోర్ట్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, 12వ తర‌గతి అడ్మి‌ట్‌‌కా‌ర్డుల్లో ఒక దాన్ని తీసు‌కురావాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments