Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22-06-2022 బుధవారం రాశిఫలాలు ... లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

kumbha rashi
, బుధవారం, 22 జూన్ 2022 (04:00 IST)
మేషం :- కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్ళే లాభదాయకం. ఏజెన్సీ, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
వృషభం :- వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత చాలా అవసరం.
 
మిథునం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది.
 
సింహం :- ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ సంతానం ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్యూలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు.
 
కన్య :- రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించటం మంచిది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వేగం అవుతాయి.
 
వృశ్చికం :- సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. వ్యాపార రంగాల వారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి.
 
ధనస్సు :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాగలవు. ప్రియతములతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి.
 
మకరం :- చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు, గృహప్రశాంత పొందుతారు. హోటల్, తినుబండారు వ్యాపారుల లాభదాయకం. విద్యుత్, ఎ.సి. కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కుంభం :- రిప్రజెంటటేటిలు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్దకూడదు.
 
మీనం :- ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-06-2022 మంగళవారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని తమలపాకులతో...