Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (08:03 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉదయం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఆరు గంటల వరకు జరగునుంది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నికను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార వైకాపా తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ పోటీకి దూరంగా ఉంది. అధికార వైకాపాతో ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగా బీజేపీ స్థానికేతరుడిని అభ్యర్థిగా నిలబెట్టింది. మొత్తంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,388 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు 78 వెబ్ క్యాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments