హన్సికకు 499/500 మార్కులు : ఆ ఒక్కటి ఎందుకు తగ్గింది? కోర్టుకు వెళతానంటున్న విద్యార్థిని

Webdunia
శనివారం, 4 మే 2019 (15:10 IST)
సాధారణంగా పబ్లిక్ పరీక్షల్లో నూటికి నూరు లేదా 99 మార్కులు వస్తే తెగ సంతోషపడిపోతాం. ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటారు. ఒకటి రెండు రోజులు ఆ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. కానీ, ఇక్కడో విద్యార్థిని మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించింది. కానీ, ఆ విద్యార్థిని సంతృప్తి చెందడం లేదు. ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు తగ్గిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలిపింది. ఆ విద్యార్థిని పేరు హన్సిక శుక్లా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నివాసి.
 
ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి.. ఈ పరీక్షల్లో హన్సికకు 500 మార్కులకు గాను 499 మార్కులు వచ్చాయి. ఒక్క ఇంగ్లీషులోనే వందకు 99 మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి. ఫలితంగా మొత్తం 500 మార్కులకుగాను ఆ విద్యార్థిని 499 మార్కులు సాధించింది. 
 
అయితే, ఇంగ్లీష్ పరీక్షలో ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గిందన్న అంశంపై న్యాయ పోరాటం చేయాలని ఆ విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు తన ఇంగ్లీష్ సబ్జెక్టు మార్కులను రీటోటలింగ్ చేయని పక్షంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు వెల్లడించింది. ఆమెకు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు, మరికొంది విద్యార్థులు మాత్రం.. హన్సిక శుక్లా లేని సమస్యలు సృష్టించుకుంటోందని, రీటోటలింగ్ పెట్టినా, కోర్టు మెట్లెక్కినా మార్కులు ఇంకా తగ్గితే ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments