జియో జాబ్ మేళా.. 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ.. త్వరపడండి..

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:57 IST)
అవును. సోమవారం జియో జాబ్ మేళా జరుగనుంది. భారత సర్కారు ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యంలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకులు ఎ.వేంకటేశ్వర రావు తెలిపారు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐ.టి.ఐలో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సి.ఐ.టి.ఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో జియో గిగా ఫైబర్ ఇన్‌స్టాలేషన్, సర్వీసెస్‌లో అసిస్టెంట్ టెక్నీషియన్స్‌గా పనిచేయడానికి ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్ధులు హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో గల జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగే జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పనిచేయడానికి ఐ.టి.ఐతో పాటు అప్రెంటీస్ చేసిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments