నేడు ఏపీ ఇంటర్ ఫలితాల వెల్లడి - గ్రేడింగ్ విధానం రద్దు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:21 IST)
ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మొదటి, రెండో సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. 
 
కాగా, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ యేడాది ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ సారి సబ్జెక్టుల వారీ మార్కులతోనే ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
ఇకపోతే, ఇంటర్ ద్వితీయ రెగ్యులర్‌ అభ్యర్థుల ఫలితాలను మాత్రం సబ్జెక్టుల వారీ గ్రేడ్‌ పాయింట్లతో ఇస్తారు. వారి ఫస్టియర్‌ ఫలితాలను గత యేడాది గ్రేడ్‌ పాయింట్లతో ఇచ్చినందున ఇప్పుడు కూడా గ్రేడ్‌ పాయింట్‌లు ఇస్తున్నారు. 
 
అలాగే, షార్ట్‌ మార్కుల మెమోలను ఇంటర్‌ బోర్డు bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా క్లౌడ్‌ సర్వీస్‌ ద్వారా ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకున్న వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ఫలితాలు అందుబాటులో ఉండే కొన్ని   వెబ్‌సైటు https://bie.ap.gov.in, https://results.bie.ap.gov.in 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం