Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 62 పోస్టులు.. దరఖాస్తులు ఆహ్వానం

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:15 IST)
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 62 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలను చేపట్టనున్నారు. స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌ఫర్ట్ పోస్టుల భర్తీకి ఈ నియామకాన్ని చేపట్టారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు sportsauthorityofindia.nic.in/saijobs వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. 
 
గత నోటిఫికేషన్ నం. 1(10)/SAI/SS/2020-21 దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు సర్టిఫికేట్లు జత చేయాలనుకున్న వారు మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌ఫర్ట్ లీడ్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.  స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌ఫర్ట్-II పోస్టుకు ఎంపికైన వారికి రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. విద్యార్హతలు.. స్పోర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు మరియు ఎక్సైర్ సైజ్ సైన్స్/స్పోర్ట్స్ సైన్స్/స్పోర్ట్స్ కోచింగ్ లో డిగ్రీ పొంది ఉండాలి.
 
ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయస్సును 45 ఏళ్లుగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో నవంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments