Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#NEETResult2020: నీట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు..

#NEETResult2020: నీట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు..
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:10 IST)
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 15.97 లక్షల మంది విద్యార్థులు నీట్ 2020 ఎగ్జామ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. 
 
సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు జరిగింది. 14.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్ష రాయకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 14న మరోసారి నీట్ 2020 ఎగ్జామ్ నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి కొందరు విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. 
 
నీట్‌లో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వచ్చిన వారు క్వాలిఫై అయినట్టు గుర్తిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 40శాతం, దివ్యాంగులు 45 శాతం సాధిస్తే క్వాలిఫై అయినట్టు పరిగణిస్తారు. నీట్ 2020 మార్కుల ఆధారంగా ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. 
 
ర్యాంకులు సాధించిన విద్యార్థులు మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల కోసం మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ప్రతీ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో నీట్ ఫలితాలను అక్టోబర్ 16న విడుదల చేస్తామని గత సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 
 
విద్యార్థులు https://ntaneet.nic.in/ లేదా https://mcc.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాలు విడుదలైన 90 రోజుల్లోగా తమ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో కోవిడ్ అప్‌డేట్: 24 గంటల్లో 1,555 కేసులు.. ఏడుగురు మృతి