సాధారణంగా ఒక దర్శకుడు ఒక ప్రాజెక్టున చేపట్టనున్నారనే వార్త లీక్ అయిందంటే.. అందులో నటించనున్న నటీనటులపై వివిధ రకాల ఊహాగానాలు వస్తుంటాయి. అలా ప్రముఖ దర్శకుడు చేపట్టనున్న ప్రాజెక్టులో తొలుత ఓ సీనియర్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, దర్శకుడు మాత్రం ఫ్రెష్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. గుణశేఖర్. సీనియర్ హీరోయిన్ అనుష్క అయితే, ఫ్రెష్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇంతకీ ఈ ముగ్గురు కథ ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేపట్టనున్న ప్రాజెక్టు శాకుంతలం. ఈ దృశ్యంకావ్యంలో హీరోయిన్‌గా తొలుత అనుష్క పేరు తెరపైకి వచ్చింది. గుణశేఖర్ ప్రాజెక్టులో శకుంతలగా అనుష్క నటించే ఛాన్స్ ఉందని మొదట్లో వార్తలొచ్చాయి.
అయితే, తాజాగా పూజ హెగ్డే పేరు ప్రచారంలోకి వచ్చింది. శకుంతల పాత్రకు పూజ అయితే ఫ్రెష్‌గా ఉంటుందని దర్శకుడు భావిస్తున్నాడని, ఈ క్రమంలో త్వరలో ఆమెను కలసి కథ చెప్పనున్నారని అంటున్నారు. మరోపక్క, సమంతను కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారట.
కాళిదాసు విరచిత శకుంతల, దుష్యంతుల కథకు గుణశేఖర్ చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన స్క్రిప్టును తయారుచేసుకున్నారని సమాచారం. రానాతో చేయాల్సిన 'హిరణ్య కశ్యప' ప్రాజక్టు ప్రస్తుతానికి హోల్డ్ చేయడంతో, గుణశేఖర్ ఈ 'శాకుంతలం' చిత్రాన్ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యారట.