ఒకప్పుడు అగ్ర కథానాయకులందరి సరసన నటించిన కథానాయిక అనుష్క ఇటీవల కొత్త నాయికల దూకుడుతో వెనుకబడింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఒకటీ అరా సినిమాలు మాత్రమే చేస్తుంది. ఆ క్రమంలో ఆమధ్య ఆమె నటించిన నిశ్సబ్దం చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. అయితే ఇది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా రివ్యూలు రావడం లేదు.
ఇదిలా ఉంచితే ఇటీవలే నిశ్శబ్దం ప్రమోషన్‌లో అనుష్క మాట్లాడుతూ తెలుగులో కొత్తగా రెండు సినిమాలు అంగీకరించానని వాటి గురించి ఆయా నిర్మాతలే సరైన సమయంలో వెల్లడిస్తారని చెప్పింది. అప్పటి నుంచి ఆ సినిమాలు ఏమిటా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వీటిలో ఒక చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా అని తాజాగా తెలుస్తొంది. ఒక ఆసక్తికరమైన స్క్రిప్టుతో ఇటీవల ఒక నూతన దర్శకుడు అనుష్క- విజయ్‌లను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఇద్దరూ ఓకే చెప్పారని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.