Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే...రూ.7 లక్షలు సంపాదించవచ్చు.. ఎలా..?

ఆ ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే...రూ.7 లక్షలు సంపాదించవచ్చు.. ఎలా..?
Webdunia
మంగళవారం, 13 జులై 2021 (10:17 IST)
One Rupee
ప్రపంచవ్యాప్తంగా పాత నోట్లు, నాణేలను సేకరించేవారు చాలా మంది ఉన్నారు. ఈ హాబీని న్యూమిస్‌మాటిక్స్ అంటారు. ఇది ఉన్నవారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి... అరుదైన పాత నోట్లు, కాయిన్లను కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే... పాతవైన వాటిని యాంటిక్ పీస్‌లుగా పరిగణిస్తారు. అలాంటి వాటికి విలువ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఓ రూపాయి నోటును రూ.5 లక్షలకు కొన్న వ్యక్తి... భవిష్యత్తులో దాన్ని వేలం పెడితే... దానికి లక్షలు లేదా కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
 
ఈ రూపాయి నోటును కేంద్ర ప్రభుత్వం 26 ఏళ్ల కిందటే ముద్రించడం ఆపేసింది. ఐతే... 2015లో మళ్లీ రూపాయి నోట్ల ముద్రణ ప్రారంభమైంది. కొత్త నోట్లు కొత్త కలర్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. ఐతే... స్వాతంత్ర్యానికి పూర్వపు రూపాయి నోటు మీ దగ్గర ఉంటే... మీరు రూ.7 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మీ దగ్గర అలాంటి పురాతన నోట్లు ఉంటే... వాటిని మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వేలానికి పెట్టి... లక్షలు సంపాదించవచ్చు.
 
స్వాతంత్ర్యానికి పూర్వం 1935లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గవర్నర్ జే డబ్ల్యూ కెల్లీ సంతకంతో... కొద్దిపాటి రూపాయి నోట్లను ముద్రించింది. ఆ నోట్లకు ఇప్పుడు ఈబే (eBay)లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే... మీరు వాటిని లక్షలకు అమ్ముకోవచ్చు. ఈబేలో మాత్రమే కాదు... ఇంకా చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటిలో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments