Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. యస్ బ్యాంక్ అదిరే ఆఫర్స్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (15:51 IST)
లోన్ తీసుకునే వారికి పెద్ద శుభవార్త. ప్రైవేట్‌కు చెందిన యస్ బ్యాంక్ తాజాగా పండుగ ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు, లో కాస్ట్ ఈఎంఐ, గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. 
 
కస్టమర్లుకు పండుగ ఆఫర్‌లో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేట్లకే రుణాలు పొందొచ్చని ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యస్ బ్యాంక్ పేర్కొంది. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్స్‌‌కు ఇది వర్తిస్తుంది. అలాగే టూవీలర్ లోన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
కస్టమర్లు వెహికల్ ఆన్ రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో వారు పొందొచ్చు. అలాగే యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి కూడా పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదనపు రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. 100కు పైగా ఆకర్షణీయ లాభాలు అందుబాటులో ఉన్నాయి. టూవీలర్ రుణాలను 8 ఏళ్లలోగా తిరిగి చెల్లించొచ్చు. ఇదేకాకుండా వ్యాల్యు యాడెడ్ సర్వీసులు కూడా అందిస్తోంది.
 
ఉచిత టెస్ట్ డ్రైవ్, ఇంటి వద్దకే డెలివరీ వంటి బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కారు కాకుండా సెకండ్ హ్యాండ్ కొనే వారికి కూడా కారు ధరకు సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తోంది. అలాగే నెలకు రూ. 9,000 ఆదాయం కలిగిన కుటుంబాలకు కూడా హౌసింగ్ లోన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద రూ.2.67 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. 
 
వడ్డీ రేట్ల వివరాలు 
వడ్డీ రేటు 10.49% నుంచి ప్రారంభం.
రుణాన్ని 6 ఏళ్లలోగా తిరిగి చెల్లించాల్సి వుంటుంది. 
పర్సనల్ లోన్ కింద రూ.50 లక్షల వరకు రుణం పొందొచ్చు. 
టూవీలర్ లోన్స్‌ పై వడ్డీ రేటు 10.99 శాతం-84 నెలలోగా లోన్ డబ్బులు కట్టాలి.
బంగారం రుణాలపై వడ్డీ రేటు 10.99 % నుంచి ప్రారంభమౌతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments