Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గృహరుణాలు తీసుకున్న వారికి గుడ్ న్యూస్..?

గృహరుణాలు తీసుకున్న వారికి గుడ్ న్యూస్..?
, శనివారం, 17 అక్టోబరు 2020 (11:00 IST)
ప్రైవేట్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. గృహ రుణాలు తీసుకున్నవారికి శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 7 శాతానికి దించింది. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ అందిస్తున్న వడ్డీరేటుకే కొటక్‌ అందిస్తుండటం విశేషం. ప్రస్తుత పండుగ సీజన్‌లో రుణాలు తీసుకునేవారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో బ్యాంక్‌.. రిటైల్‌, వ్యవసాయరుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును ఎత్తివేయడంతోపాటు వేగంగా ఆన్‌లైన్‌ అనుమతులు జారీచేసింది. 
 
ఈ ప్రత్యేక స్కీం నెల రోజుల పాటు అమలులో ఉండనుంది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణాలపై వడ్డీరేటు 7 శాతంతో ప్రారంభమవనుండగా, ఇతర బ్యాంక్‌ల నుంచి బదిలీ చేసుకునేవారికి రూ.20 లక్షల వరకు లబ్ధిపొందనున్నారు. ఎస్బీఐ మాత్రం రూ.30 లక్షల లోపు రుణాలపై 7 శాతం వడ్డీని వసూలు చేస్తున్నది. మహిళలకు మరో 0.05 శాతం రాయితీ ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరిలో మంగళసూత్రం కట్టా, చంపేయమని దివ్య నాకు కత్తి ఇచ్చింది, పొడిచేసా: నిందితుడు నాగేంద్ర