తాత్కాలిక ఆర్థిక మంత్రిగా రెండుసార్లు... పియూష్ గోయల్ గురించి కాస్త...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:34 IST)
రానున్న ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిం. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. గత ఐదుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ ప్రస్తుతం అనారోగ్య కారణాలరీత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండడంతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 
కాగా.. ఈయన ఆర్థిక మంత్రిగా రెండోసారి తాత్కాలిక బాధ్యతలు చేపట్టినా‌.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పియూష్‌ గోయల్‌ నేపథ్యంలోకి చూస్తే... అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడే పియూష్ గోయల్‌. ఈయన 1964 జూన్‌ 13న జన్మించారు. ముంబయిలోని మతుంగాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన గోయల్‌.. సీఏగా ఆల్‌ఇండియా రెండో ర్యాంక్‌ సాధించారు. 
 
ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోర్డుల్లో ప్రభుత్వ నామినీ సభ్యుడిగా కూడా పనిచేశారు. గతంలో ఆయన భాజపాలోనే అనేక కీలక పదవులను కూడా చేపట్టారు. 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన విద్యుత్‌, బొగ్గు, గనుల శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. 2017 సెప్టెంబరు 3న గోయల్‌ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 
కాగా పియూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో అరుణ్‌ జైట్లీ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. 2018వ సంవత్సరం మే నుండి ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇటీవల జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురై చికిత్స కోసం అమెరికా వెళ్లిన నేపథ్యంలో గోయల్‌ మళ్లీ తాత్కాలిక ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments