Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#BudgetForNewIndia పైరసీపై కొరడా.. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు

#BudgetForNewIndia పైరసీపై కొరడా.. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:25 IST)
బాలీవుడ్‌తో పాటు వేర్వేరు సినీ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశం లభిస్తోందని.. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ సమస్యను నిర్మూలించేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కీలక మార్పులు తీసుకొస్తామని కేంద్రం ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తాను ఇటీవల ఓ థియేటర్ లో ’యూరీ’ థియేటర్ లో సినిమా చూస్తే దొరికే కిక్కు పైరసీలో ఉండదని గోయల్ స్పష్టం చేశారు. 
 
ఇక సినీ పరిశ్రమ వర్గాలకు ఇక సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. అనుమతుల కోసం ఇక అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం వుందడని క్లారిటీ ఇచ్చారు. గతంలో సినిమా థియేటర్లపై 50 శాతం పన్ను భారం పడేదనీ, కానీ ఎన్డీయే ప్రభుత్వం దీన్ని 12 శాతానికి (జీఎస్టీ) తగ్గించిందన్నారు. ఫిలిమ్ మేకర్లు ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని పీయూష్ గోయల్ అన్నారు. ఇప్పటివరకూ విదేశీ ఫిల్మ్ మేకర్లకు మాత్రమే ఉన్న ఈ సౌకర్యాన్ని భారతీయులకూ వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు.
 
బడ్జెట్ కీలకాంశాలు 
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 3 వేల కోట్ల ఆదా
ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు ధనసాయం
చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు
ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లను ఆదా చేశాం
గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు
 
కరెంట్ అకౌంట్ లోటును 5.6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాం
మా ప్రభుత్వంలోనే పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం
ద్రవ్యోల్బణాన్ని కిందకు తెచ్చేందుకు ఎన్డీయే కృషి ఫలించింది
బ్యాంకులకు రూ. 2.60 లక్షల కోట్ల మూలధన నిధులను అందించాం
ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి
అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదేనని పీయూష్ గోయల్ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Budget2019 : రైల్వేకు రూ.64,587 కోట్లు.. త్వరలో పట్టాలపైకి వందే భారత్ రైలు...