కేంద్ర తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ దేశ రైల్వే రంగానికి 64,587 కోట్ల రూపాయలను కేటాయించారు. త్వరలోనే రైలు పట్టాలపైకి వందే భారత్ అనే పేరుతో సరికొత్త సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు
దేశ రైల్వేల చరిత్రలోనే ఈ యేడాది ప్రమాదాలు అతి తక్కువ సంఖ్యలో జరిగిన సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు.