మార్కెట్‌లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 400, ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:27 IST)
దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ తయారు చేసే కార్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యూవి 700 రికార్డు బుకింగ్స్ కావడమే అందుకు ఉదాహరణ. పైగా, ప్రస్తుత ట్రెండ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ కంపెనీ మరో ఎక్స్‌యూవీ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌‍యూవీ మోడల్ లుక్‌ను విడుదల చేసింది. 
 
ఈ కారు ధర రూ.14 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. లుక్స్ పరంగా చూస్తే ఇది ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్‌, క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్‌లైట్‌లతో పూర్తిగా రీడిజైన్ చేశారు. సింగిల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ 150 హార్స్ పవర్, రెండు బ్యాటరీ ఆప్షన్ కలిగివుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. 
 
ఎక్స్‌యూవీ 300తో పోలిస్తే 4.2 మీటర్ల పొడవుతో లోపలిభాగం విశాలమైన విస్తీర్ణంతో ఉంది. ఆరు ఎయిర్‌ బ్యాగులు, వాటర్ ఫ్రూప్ బ్యాటరీ ప్యాక్, ప్రతి చక్రానికి డిస్క్ బ్రేకులు, రియర్ వ్యూ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను అందులో పొందుపరిచారు. ఈ కారు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు కాగా, 8.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments