Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:05 IST)
భాగ్య నగరిలో మందు బాబులకు చెడు వార్త. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ దుకాణాల మూసివేత రెండు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, శుక్ర, శనివారాల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. 
 
అలాగే, దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులను మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దుకాణాలను మూసివేయనున్నారు. మద్యంషాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, గణేష్ నిమజ్జాన్ని పురస్కరించుకుని తెలంగాణాలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, నవంబరు 12వ తేదీన వచ్చే సెలవు దినాన్ని పని దినంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments