Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న శాఖాహార భోజన ధర! క్రిసిల్ నివేదిక

సెల్వి
శనివారం, 6 జులై 2024 (14:52 IST)
దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావం కారణంగా హోటల్లు, రెస్టారెంట్లలో భోజన ధరలు కూడా పెరుగుతున్నాయి. గత యేడాది జూన్ నెలతో పోల్చితే ఈ యేడాది జూన్ నెలకు పది శాతం ధరలు పెరిగాయని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ నెలవారీ రొటి రైస్ రెట్ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా, శాఖాహార భోజనం ధర పది శాతం మేరకు పెరిగినట్టు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం చికెన్ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందని తెలిపింది.
 
వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర 2023 జూన్ నెలలో రూ.26.70 కాగా, ఈ ఏడాది జూన్ నెలలో రూ.29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ.27.80గా ఉంది. ఉల్లి, టమాటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పుల ధరలు పెరగడమే కారణంగా నివేదిక పేర్కొంది. 
 
ఇక శాఖాహారం థాలీ ధరలు పెరగడానికి టమోటా ధరలు 30 శాతం, బంగాళదుంపలు 59 శాతం, ఉల్లి 46 శాతం పెరగడం కారణంగా నివేదిక తెలిపింది. రబీ విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో ఉల్లి దిగుబడి పడిపోయింది. మార్చిలో అకాల వర్షాల కారణంగా బంగాళదుంపలు తక్కువ దిగుబడిని సాధించినట్లు క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. ఇటు చికెన్ రేటు 14 శాతం తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్‌లో రూ.58కి దిగివచ్చింది. గతేడాది జూన్ నెలలో ఇది రూ.60.50గా ఉంది. అయితే, ఈ ఏడాది మే నెలలో ఇది కేవలం రూ.55.90గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments