Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-07-2024 శనివారం దినఫలాలు - శత్రువులపై విజయం సాధిస్తారు...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 6 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ తె.3.56 పునర్వసు తె.5.09 సా.వ.4.56ల 6.34 ఉ.దు.5.34 ల 7.17.
 
మేషం :- రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్త్రీలలో ఉత్సాహం పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు అధికం అగుటవలన ఆందోళనకు గురవుతారు. రచయితలకు, పత్రికారంగంలో వారికి కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటారు.
 
వృషభం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొన్ని సమస్యలు మబ్బువిడినట్లు విడిపోవును. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. భాగస్వామ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. శతృవులపై విజయం సాధిస్తారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
మిథునం :- సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించ గలుగుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు.
 
కర్కాటకం :- బ్యాంకింగ్ రంగాల వారికిమెళుకువ అవసరం. రవాణా రంగంలో వారికి పనివారితో చికాకులు తప్పవు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు.
 
సింహం :- దుబారా ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 
 
కన్య :- నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటంమీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రేమికులకు పెద్దల వైఖరి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. ప్రైవేటు రంగాల్లోవారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన బంధువుల సహాయంతో సమసిపోగలవు. రాజకీయాలలోనివారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు చుట్టు ప్రక్కలవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలిసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. హోటల్, తినుబండారాలు, వ్యాపారులకు క్యాటరింగ్ వారికి కలిసివస్తుంది. స్త్రీలకు కాళ్ళు, నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మకరం :- నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులను సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల మొండి వైఖరి వల్ల ఉపాధ్యాయులకు చికాకులు తలెత్తుతాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకొవాలనే స్త్రీల కోరిక వాయిదా పడుతుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మీనం :- ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతాయి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ఆలయాలను సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆషాఢంలో గుప్త నవరాత్రులు.. కలశ స్థాపన ఎలా?