Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

03-07-2024 బుధవారం రాశిఫలాలు - ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు...

astrolgy

రామన్

, బుధవారం, 3 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ॥ ద్వాదశి ఉ.7.04 రోహిణి తె.4.39 రా.వ.8.52 ల 9.25. ప.దు. 11.37 ల 12.30.
 
మేషం :- స్వతంత్ర్య నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూరగలదు. బహుమతులు అందుకుంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
వృషభం :- మీ మాటతీరు, పద్ధతులతో మీ మాటతీరు, పద్ధతులతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. 
 
మిథునం :- ఆర్థిక విషయాలలో భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. చేపట్టిన పనిపై ఏ మాత్రం ఆసక్తి ఉండదు. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం :- పండ్ల, పూల, కూర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం కానవచ్చును. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. అందరిలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకి తెలియకుండా గోప్యంగా ఉంచండి.
 
సింహం :- ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. బంగారు, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. ప్రయాణాలలో ఒకరి వైఖరి ఆందోళన కలిగిస్తుంది.
 
కన్య :- స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం పై చదువులకోసం బాగా శ్రమిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యంలో ఆకస్మిక ఆందోళన తప్పదు.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధు మిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
వృశ్చికం :- ఒక విషయంలో మిత్రులపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతుంది. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలకు సంబంధించి ఆందోళనలు అధికమవుతాయి. ఎప్పటినుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. వాణిజ్య రంగాలలోని వారికి చురుకుదనం కానవస్తుంది. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్పురిస్తాయి. వస్తువులు కొనుగోలుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం :- సభ సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ సోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. స్త్రీల అ జాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
కుంభం :- బ్యాంకింగ్ రంగాల వారికి మెళుకువ అవసరం. క్రయ విక్రయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీవారు, శ్రీమతి మధ్య గతంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు తొలిగిపోతాయి. స్త్రీలు ఇంటికి కావలసిన విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరంలోవున్న బంధు మిత్రులకు సంబంధిచిన సమాచారం అందుతుంది.
 
మీనం :- మీ ఆశ్రద్ధ, ఆలస్యం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు. సానుకూలమైన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. క్లిష్టమైనసమస్యలు తలెత్తినా సమర్ధతతో ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-07-202 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు...