Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-06-2024 శుక్రవారం దినఫలాలు - స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం...

Shukra Vakri 2023

రామన్

, శుక్రవారం, 28 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ॥ సప్తమి సా.6.11 పూర్వాభాద్ర ప.12.29 రా.వ.9.24 ల 10.53. ఉ.దు. 8.04 ల 8. 56 ప. దు. 12.24 ల 1.16.
 
మేషం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. చేతి వృత్తి వ్యాపారాలలో మార్పులు కానవస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతికకార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. 
 
వృషభం :- మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ఉద్యోగ, రుణయత్నాల్లో కొంత పురోగతి ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి.
 
మిథునం :- మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళుకువ అవసరం. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం వ్యయం చేస్తారు.
 
కర్కాటకం :- ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. మిత్రులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి.
 
సింహం :- ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడుట మంచిది.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యం. కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
తుల :- ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. విద్యార్ధులకు ఆశించిన కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ఊహంచని ఖర్చులు ఎదురైనా ఆర్ధిక ఇబ్బందులు అంతగా ఉండవు.
 
వృశ్చికం :- ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొని ఉంటుంది. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసివస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ వహించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
ధనస్సు :- స్త్రీలు ఆదాయంపై, ధన సంపాదనపై మరింత దృష్టిపెడతారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం కాగలవు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం :- బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటు ఏదీఉండదు.
 
కుంభం :- మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిమ్మల్ని చూసి అశూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి.
 
మీనం :- ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-06-202 గురువారం రాశిఫలాలు - నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు...