Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-06-2024 శనివారం దినఫలాలు - ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు....

Advertiesment
astrolgy

రామన్

, శనివారం, 29 జూన్ 2024 (05:04 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ|| అష్టమి సా.3.44 ఉత్తరాభాద్ర ఉ.10.48 రా.వ.9.59 ల 11.29. ఉ.దు. 5.28 ల 7.11.
 
మేషం :- వ్యాపారులకు అధికారులు నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. మిత్రులతో కలియికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం :- పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారాలుకు లభదాయకం. ప్రయాణాలలో బంధువులతో ఉల్లాసం గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
మిథునం :- ఉద్యోగస్థులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖికపరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కర్కాటకం :- ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది, ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి.
 
సింహం :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో సమస్యలు అధికమవుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వాతావరణ మార్పు వల్ల అందోళనకు గురవుతారు. వాహనచోదకులకు చికాకులు తలెత్తుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.
 
కన్య :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీపనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
తుల :- బంధువుల రాకతో మీ ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. సంకల్ప బలంతో కొన్నిలక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్లమానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది.
 
ధనస్సు :- స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తిపరంగా చికాకులు, సమస్యలు తలెత్తినా ధైర్యంగా నిలదొక్కుకుంటారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మకరం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకంకాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
కుంభం :- ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు.
 
మీనం :- ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. కార్మికులకు కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అష్టమి రోజున కాలభైరవ పూజ.. రాహు-కేతు దోషాలు పరార్