Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ లిస్ట్ : యువ వ్యాపార దిగ్గజాల సరసన టాలీవుడ్ హీరో భార్య

ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన 22 మంది యువ వ్యాపారదిగ్గజాల సరసన టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చోటుదక్కించుకున్నారు.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:21 IST)
ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన 22 మంది యువ వ్యాపారదిగ్గజాల సరసన టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చోటుదక్కించుకున్నారు. వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన రేపటి భారత వ్యాపారవేత్తల పేరుతో ఈ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాలో అపోలో ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలిగా, అపోలో లైఫ్ ఎండీగా కొనసాగుతున్న ఉపాసన పేరు ఉంది.
 
ఇక ఈ జాబితాలో ఏపీసెజ్ సీఈవో కరణ్ అదానీ, ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎండీ అశ్నీ బియానీ తదితరులకూ స్థానం లభించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, కుమార మంగళం బిర్లా కుమార్తె, స్వతంత్ర మైక్రోఫైనాన్స్ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా కూడా ఉన్నారు. యెస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కూతురు, ది త్రీ సిస్టర్స్ ఇనిస్టిట్యూషనల్ ఆఫీస్ వ్యవస్థాపకురాలైన రాధా కపూర్ ఖన్నా, ఐడీ ఫ్రెష్ ఫుడ్ సహవ్యవస్థాపకుడు పీసీ ముస్తఫా ఇలా అనేక 22 మంది ఉన్నారు.
 
వీరితోపాటు బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు, నటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ ఉన్నారు. వారివారి వ్యక్తిగత సంపద ఆధారంగానే ఈ జాబితా రూపొందలేదన్న ఫోర్బ్స్.. కుటుంబ వ్యాపారాల వారసత్వానికి, పారిశ్రామికవేత్తల తొలి తరానికి ఈ జాబితా అద్దం పడుతున్నదని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments