Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 మంగళ కలెక్షన్ విడుదల చేసిన టిబిజెడ్-ది ఒరిజినల్

ఐవీఆర్
శనివారం, 17 ఆగస్టు 2024 (15:28 IST)
ప్రముఖ నటి సంయుక్త మీనన్, హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద నున్న ప్రఖ్యాత టిబిజెడ్-ది ఒరిజినల్ స్టోర్‌లో వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా "2024 మంగళ కలెక్షన్"ని ఆవిష్కరించడంతో ఒక వైభవం ఆవిష్కృతమైంది. ఈ పండుగ సీజన్‌లో, దక్షిణ భారతదేశంలోని మహోన్నత సాంస్కృతిక వైభవానికి నివాళులు అర్పించే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ కలక్షన్లో వజ్రాలు, బంగారం ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోయి ఉండటమే కాదు అద్భుతమైన పనితనపు ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాయి.
 
సంక్లిష్టంగా రూపొందించబడిన నడుము బెల్ట్‌ల నుండి సొగసును ప్రసరింపజేసే ప్రకాశవంతమైన నెక్లెస్‌ల వరకు, ఈ కలెక్షన్ లోని ప్రతి ఆభరణం, భారతదేశం యొక్క కాలానుగుణ సంప్రదాయాలకు నివాళిలా ఉంటుంది. ఈ కలెక్షన్ లోని ఆకర్షణీయమైన ఫ్యాన్సీ సెట్‌లలో ఒకదానిని అలంకరించుకున్న సంయుక్త మీనన్, టిబిజెడ్ -ది ఒరిజినల్ షోరూమ్‌లలో లభించే సున్నితమైన రత్నాలు, క్లిష్టమైన డిజైన్‌లతో తీర్చిదిద్దబడిన బంగారు, వజ్రాల ఆభరణాల విస్తృత శ్రేణిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ, “టిబిజెడ్-ది ఒరిజినల్ చేస్తున్న ఈ విడుదల కార్యక్రమంలో భాగం కావటాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. ‘2024 మంగళ కలెక్షన్‌’ని ఆవిష్కరించే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం నుండి ప్రేరణ పొందిన ఈ తరహా అందమైన ఆభరణాలను అలంకరించుకోవడం నిజంగా ఒక గౌరవం. ఈ రోజు ఈ కలెక్షన్ నుండి ప్రకాశవంతమైన సెట్‌లలో ఒకదాన్ని ధరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. టిబిజెడ్-ది ఒరిజినల్ నిజంగా మీకు “సరైన ఎంపిక, సరైన ధర” కలిగిన ఉత్పత్తులను అందిస్తుంది. నా అన్ని రకాల ఆభరణాల అవసరాల కోసం ఇది నా గమ్యస్థానం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments