Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటల్ సేతు బ్రిడ్జిపై దూకిన యువతి.. క్యాబ్ డ్రైవర్, పోలీసులు అలా పట్టుకున్నారు.. (వీడియో)

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (14:34 IST)
Atal Setu
ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని క్యాబ్ డ్రైవర్ కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ కావడంతో నెటిజన్లు క్యాబ్ డ్రైవర్, పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళ క్యాబ్‌లో వెళ్తూ అటల్ సేతు బ్రిడ్జిపై ఆగింది. ఆ తర్వాత క్యాబ్ దిగి అటల్ సేతు బ్రిడ్జి రేలింగ్ అంచున కూర్చొంది. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగానే ఆమె సడన్‌గా దూకే ప్రయత్నం చేసింది.
 
క్షణాల్లో స్పందించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఆ తర్వాత అటు నుంచి వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను పట్టుకొని సురక్షితంగా పైకి లాగారు. ఇదంతా అటల్ సేతు బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదైంది. 
 
బాధితురాలు ములుంద్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments