Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు విత్తమంత్రి నిర్మలమ్మ కేటాయింపులు ఏంటి?

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (16:24 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో 2023-24 సంపత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపంగా ఆమె అభివర్ణించారు. అలాంటి బడ్జెట్‌తో రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. అలాగే, తెలంగాణ వాటా రూ.21,470 కోట్లుగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఏపీలోని కేంద్ర సంస్థలకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్శిటీకి రూ.168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు చొప్పున కేటాయించారు. 
 
అలాగే, తెలంగాణాలోని సంస్థలకు కేటాయించిన కేటాయింపులు చూస్తే, సింగరేణికి రూ.1650 కోట్లు, ఐఐటీ - హైదరాబాద్‌కు రూ.300 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1473 కోట్లు చొప్పున కేటాయించారు. 
 
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులును పరిశీలిస్తే, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు రూ.37 కోట్లు, మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు, సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు చొప్పున కేటాయించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments