Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ఉజ్వల భవిష్య వైపు పయనిస్తుంది : నిర్మలా సీతారామన్

budget
, బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:52 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంపత్సరానికిగాను కేంద్ర వార్షిక బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉంది, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఎవరూ ఆకలితో ఉండరాదన్న ఏకైక లక్ష్యంతో సుమారు 80 కోట్ల మందికి 28 నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు అందించినట్టు తెలిపారు. 
 
ఈ వార్షిక బడ్జెట్‌ను మహిళలు, పిల్లలు, షెడ్యూల్డ్ తెగల ప్రగతిని ప్రాతిపదికగా ఉంచుతూ బడ్జెట్ తయారు చేయడం జరిగిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక మెరుస్తున్న నక్షత్రం. స్వతంత్ర భారత 75వ బడ్జెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం మెచ్చుకుంది. మహిళలు, యువత, పరిశ్రమలు, రైతులకు సంబంధించిన బడ్జెట్ ఇది. వ్యక్తిగత ఆదాయం రెండింతలు పెరిగింది. ప్రధానమంత్రి బీమా పథకాల ద్వారా 44 కోట్ల మంది లబ్ధి పొందారని తెలిపారు. 
 
భారత ఆర్థికాభివృద్ధి సరైన దిశలో సాగుతోంది మరియు మన ఆర్థిక వ్యవస్థకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఆహారం మరియు ధాన్యం పంపిణీ పథకానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించామన్నారు. ఈ బడ్జెట్ దేశం యొక్క రాబోయే 100 సంవత్సరాలకు బ్లూప్రింట్ అవుతుందన్నారు. 9 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుంది. దేశ వృద్ధి 7 శాతంగా ఉందన్నారు. 
 
ప్రపంచ సవాళ్ల సమయంలో, భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ పాత్రను బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. 2014 నుండి ప్రభుత్వ ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలను అందించామన్నారు. 9 సంవత్సరాలలో 9 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 
 
తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగి రూ.1.97 లక్షలకు చేరుకుందియ. 102 కోట్ల మందికి 220 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లను అందించినట్టు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7శాతంగా అంచనా వేయడం జరిగిందన్నారు. 11.4 కోట్ల మంది రైతులకు బ్యాంకుల ద్వారా నేరుగా సాయం అందించినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఫోన్ ట్యాప్ చేశారు.. వైకాపా టిక్కెట్‌పై పోటీ చేయను : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి