Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడాన్‌పై ఎలక్ట్రానిక్స్ విభాగం కింద కోటి రూపాయల విలువ అమ్మకాలను సాధించిన 400 మంది విక్రేతలు

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (23:08 IST)
భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌, 2020వ సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ విభాగం కింద ఒక కోటి రూపాయల విలువ కలిగిన అమ్మకాలను 400 మంది విక్రేతలు ద్వారా చేసినట్లు వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై 2020వ సంవత్సరంలో 1.13 లక్షల మంది నూతన విక్రేతలు వచ్చారు. ఈ కాలంలో ఉడాన్‌ దాదాపు 160 మిలియన్‌ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను 53 లక్షల ఆర్డర్ల ద్వారా 12 వేల పిన్‌కోడ్స్‌కు బదిలీ చేసింది.
 
మహమ్మారి కారణంగా అధిక శాతం మంది వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు వినియోగించుకుంటున్నారు. ఈ కారణంగానే  ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, బీహార్‌ లాంటి రాష్ట్రాల నుంచి వీటికి అధికంగా ఆర్డర్లు వచ్చాయి. లాక్‌డౌన్‌ తరువాత ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌కు విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2020వ సంవత్సరంలో దాదాపు 120 మిలియన్‌లకు పైగా యాక్ససరీలు, కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ను విక్రయించగా, అనుసరించి 10 మిలియన్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్లను ఈ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించారు. అన్‌లాక్‌ తరువాత కేవలం మూడు నెలల్లో  50 మిలియన్‌ ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులను ఉడాన్‌ విక్రయిస్తే వాటిలో ఆడియో, మొబైల్‌ యాక్ససరీలు (19%), పవర్‌ యాక్ససరీలు (16%), మొబైల్‌ హ్యాండ్‌సెట్లు (9%),  కంప్యూటర్లు మరియు ఐటీ యాక్ససరీలు (7%) మరియు కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ (6%) విక్రయించబడ్డాయి.
 
ఉడాన్‌- ఎలక్ట్రానిక్స్ విభాగం, హెడ్- హృఫికేష్‌ థిటే మాట్లాడుతూ, ‘‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు ప్రొఫెషనల్స్‌, ఫ్యామిలీల నుంచి డిమాండ్‌ అధికంగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ ధోరణి కనిపిస్తుంది. మా ప్లాట్‌ఫామ్‌పై విక్రేతలు అధికంగా దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఎన్నో చిన్న, పెద్ద బ్రాండ్లు నూతన మార్కెట్‌లను చేరుకోవడానికి ఉడాన్‌పై చేరాయి. ఉడాన్‌ పట్ల తమ నమ్మకం చూపిన విక్రేతలు, కొనుగోలుదారులకు ధన్యవాదములు తెలుపుతున్నాం..’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments