Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఛైర్మన్ ముందుచూపు.. YES BANK నుంచి దేవుడి సొమ్ము రిటర్న్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుచూపుపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యస్ బ్యాంకులో వున్న రూ.600కోట్ల శ్రీవారిని డిపాజిట్లను కొన్ని నెలల క్రితమే వైవీ సుబ్బారెడ్డి ఉపసంహరించుకోవడం ఎంతో మేలు జరిగింది. 
 
యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని ఆర్బీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్‌‍పై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో వినియోగదారులకు పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేసే విషయంలో ఇబ్బందులు తప్పలేదు. 
 
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ హయంలో ఎస్ బ్యాంకుతో సహా 4 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులను టీటీడీ డిపాజిట్లు చేసింది. టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత...డిపాజిట్లపై వైవీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. 
 
ఎస్ బ్యాంకు పరిస్థితులపై ముందే ఆరా తీసిన వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో వెంటనే అందులో ఉన్న డిపాజిట్లను రిటర్న్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 600 కోట్ల టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments