Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయోవృద్ధులను స్కామ్స్ నుండి రక్షించుటకు ఖ్యాల్‌తో ట్రూకాలర్ భాగస్వామ్యం

ఐవీఆర్
బుధవారం, 6 ఆగస్టు 2025 (18:46 IST)
వయోవృద్ధులు ఈ డిజిటల్ యుగాన్ని స్వీకరిస్తున్న సమయములో, వారికి ఇదివరకు కంటే ఎక్కువ ప్రమాదం ఉండవచ్చు అని వారు కనుగొంటున్నారు. తెలియని సాంకేతికత, వేగంగా-పెరుగుతున్న మోసాల పన్నాగాలతో, సైబర్ నేరము బారినపడిన బాధితులు 50 పైబడిన వయసు ఉన్నవారే అనడములో ఆశ్చర్యము లేదు. చాలామంది కేవలం డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా, వారి భద్రతా భావం, నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు.
 
పెరుగుతున్న విపత్తుకు స్పందనగా, ప్రముఖ ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్స్ ప్లాట్ఫార్మ్ అయిన ట్రూకాలర్, వయోవృద్ధుల సాధికారత, సంక్షేమము పట్ల నిబద్ధత ఉన్న భారతదేశములో మొదటి స్థానములో ఉన్న ఖ్యాల్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం వయోవృద్ధులతో ఖ్యాల్‌కు ఉన్న లోతైన అనుబంధాన్ని, అర్థవంతమైన పరస్పర చర్యలతో వారి ప్రత్యేక అవసరాలను అర్థంచేసుకోవడం, స్పందించం- ట్రూకాలర్ యొక్క అత్యాధునిక కాలర్ గుర్తింపు సాంకేతికతతో కలుపుతుంది. కలిసి ఈ రెండు సంస్థలు నమ్మకమైన, విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌ను పెంచే ఒక ధృఢమైన, సురక్షితమైన కవచాన్ని సృష్టిస్తాయి తద్వారా భారతదేశములోని వయోవృద్ధులకు ఒక సురక్షితమైన, మరింత కనెక్ట్ చేయబడిన కమ్యూనిటీని నిర్మిస్తాయి.
 
ఖ్యాల్ సభ్యులందరు, వారికి కాలర్ గుర్తింపు, స్పామ్ రక్షణ ఫీచర్స్‌కు యాక్సెస్ ఉందని నిర్ధారిస్తూ, ట్రూకాలర్ ప్రీమియం సభ్యత్వముపై ప్రత్యేక 50% రాయితీ అందుకుంటారు. అదనంగా, ఈ సమగ్ర భద్రత కార్యక్రమములో భాగంగా, ఖ్యాల్, ట్రూకాలర్ అంకితమైన విద్యాసంబంధ కంటెంట్‌ను కలిసి సృష్టిస్తారు. ఇందులో, “కొత్త స్కామ్ హైలైట్స్’ సెషన్స్ ఉంటాయి. ఇవి ఉత్పన్నము అవుతున్న మోసపు పన్నాగాలను డీకోడ్ చేయడము, ఇంటరాక్టివ్ “స్పాట్ ది స్కామ్” వర్క్ షాప్స్, పోటీలను, తెలియని నంబర్ల నుండి కాల్స్ కొరకు ఆవశ్యకమైన మార్గదర్శకాలు, స్కామ్ ప్రయత్నాలను విజయవంతంగా గుర్తించిన, తప్పించుకున్న ఖ్యాల్ వయోవృద్ధుల నుండి శక్తివంతమైన ప్రమాణిత పత్రాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు డిజిటల్, ఆన్-గ్రౌండ్ ఫార్మాట్స్ సమ్మేళనము ద్వారా అందించబడతాయి. వయోవృద్ధులకు వర్క్ షాప్స్, సెషన్స్‌కు ఖ్యాల్ యాప్‌పై ప్రాప్యత ఉంటుంది.
 
ఖ్యాల్ యొక్క “50 అబౌ50” ఈవెంట్ ద్వారా ఈ భాగస్వామ్యము ఇంటరాక్టివ్ అవగాహన సెషన్స్, వయోవృద్ధులకు ప్రాక్టికల్, ఆచరణాత్మక విద్య మరియు డిజీటల్ భద్రతపై అంతర్దృష్టులు అందించే అంకితభావము కలిగిన భద్రత బూత్స్ తో డిజిటల్ సరిహద్దులను దాటి విస్తరిస్తుంది.“
 
ట్రూకాలర్ యొక్క ఫ్రీ వర్షన్ కూడా పనిచేస్తుండగా, ప్రీమియం సబ్‎స్క్రిప్షన్ లో మెరుగైన స్పామ్ బ్లాకింగ్, మోసాలు, అవాంఛనీయ కమ్యూనికేషన్ నుండి వయోవృద్ధులకు మెరుగ్గా రక్షించే అనేక ఆధునిక భద్రత ఫీచర్స్ ఉన్నాయి. ఈ సాంకేతిక-ఆధారితమైన వైఖరి, విద్య ద్వారా వయోవృద్ధులకు సాధికారతను అందించడము, వారికి ఒక సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించుటకు కొనసాగుతున్న ఖ్యాల్ యొక్క నివారణ అదనపు పొరను అందిస్తుంది.
 
"డిజిటల్ యుగము వయోవృద్ధులకు కనెక్షన్, సౌకర్యము, కమ్యూనిటి అనేవి అందిస్తూ అద్భుతమైన వాగ్దానం చేస్తుంది. కాని వారు సిద్ధంగా లేని అనేక కొత్త బెదిరింపులు కూడా తీసుకొస్తుంది," అన్నారు రిషిత్ ఝున్‎ఝున్‎వాలా, గ్లోబల్ సీఈఓ, ట్రూకాలర్. "స్కామ్స్ వలన మోసపోయిన అనేకమంది వయోవృద్ధుల హృదయవిదారకమైనకథనాలు మేము విన్నాము. ఈ సమస్యలను సురక్షితంగా ఎదుర్కొనుటకు కావలసిన పరిజ్ఞానము, సాధనాలను వారికి అందించుటకు ఖ్యాల్ తో మా భాగస్వామ్యము ఒక అర్ధవంతమైన చర్య."
 
భాగస్వామ్యముపై వ్యాఖ్యానిస్తూ, హిమాన్షు జైన్, ఫౌండర్-సీఈఓ, ఖ్యాల్ ఇలా అన్నారు, “గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వయోవృద్ధులు కష్టపడి-సంపాదించుకున్న పొదుపులను, వారి నమ్మకాన్ని, డిజిటల్ మోసాల పన్నాగాల గురించి తెలియని వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మోసం చేసే ఆధునిక మోసగాళ్ళ వలన పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్ బారిన పడుతున్నందుకు అవుతున్న ఈ మానసిక గాయాలు చాలా నష్టం కలిగిస్తున్నాయి. ఇవి తరచూ డిజిటల్ సాధనాలు ఉపయోగించుటకు వారి ఆందోళన, విశ్వాసం కోల్పోవడానికి దారి తీస్తుంది. ఖ్యాల్ వద్ద, మేము ఈ నిశ్శబ్ద విపత్తును గుర్తించాము. డిజిటల్ వర్క్ షాప్స్ ద్వారా అవగాహన పెంచాలని కట్టుబడి ఉన్నాము. ట్రూకాలర్‌తో ఈ భాగస్వామ్యము ఆ నిబద్ధతను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రమాద సూచికలను గుర్తించడం నేర్చుకోవడం ద్వారా, ట్రూకాలర్ వంటి సరైన సాధనాలు ఉపయోగించి ఉత్పన్నం అవుతున్న స్కామ్ పన్నాగాల గురించి తెలుసుకొని ఉండడం వలన వయోవృద్ధులు తమను తాము మోసగాళ్ళ  నుండి రక్షించుకుంటూ, వారి స్వేచ్ఛను కాపాడుకోగలుగుతారు.”
 
ఈ భాగస్వామ్యము ద్వారా ఖ్యాల్ మరియు ట్రూకాలర్ భారతదేశములోని వయోవృద్ధులు భద్రత, విశ్వాసాలతో డిజిటల్ ప్రపంచములో నావిగేట్ చేయగలరు అని నిర్ధారించుటకు డిజిటల్ భద్రత, మోసాల నివారణకు ఒక కొత్త ప్రామాణికతను ఏర్పరుస్తున్నారు. లక్షల కొద్దీ ఉన్న వయోవృద్ధులు ఉన్న ఖ్యాల్ యొక్క విశ్వసనీయమైన వేదిక, ట్రూకాలర్ యొక్క అత్యాధునిక మోసాల నివారణ సాంకేతికతలను కలపడం ద్వారా, ఈ కార్యక్రమము సాధికారతతో రక్షణను ఇవ్వాలనే లక్ష్యముతో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments