Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు 45 పైసలుకే ప్రమాద బీమా : మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఠాగూర్
బుధవారం, 6 ఆగస్టు 2025 (18:06 IST)
రైలు ప్రయాణికులకు కేవలం 45 పైసలకే  ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, గత ఐదేళ్ల కాలంలో రూ.27.22 కోట్ల మేరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించడం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులు ఆన్ లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే టిక్కెట్‌లో ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకోవచ్చన్నారు. ఈ పథకం ఆన్‌లైన్‌లో కన్ఫార్మ్ లేదా ఆర్ఏసీ రిజర్వుడ్ టిక్కెట్ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. 
 
ప్రీమియంగా 45 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. ఇది టికెట్ ధరతో పాటు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రయాణికులకు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీకి బీమా పాలసీ వివరాలు అందుతాయని తెలిపారు. పాలసీకి సంబంధించిన నామినీ వివరాలు నమోదు చేసుకునే లింక్ కూడా మెసేజ్ వస్తుందని చెప్పారు. బీమా పాలసీ జారీ, క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సంబంధించి బీమా సంస్థే పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. ప్రయాణికులు, బీమా సంస్థ మధ్యే ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే వివరాలు సదరు బీమా సంస్థ పంపిన మెయిల్లో ఉంటాయని చెప్పారు. ప్రయాణికులు నేరుగా సంస్థతోనే క్లెయిమ్ దాఖలు చేసి పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు.
 
ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఐదేళ్లలో మొత్తం 333 బీమా క్లెయిమ్‌ను పరిష్కరించినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రూ.27.22 కోట్లను ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు చెల్లించాయని పేర్కొన్నారు. ఈ బీమా పథకం ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించామని, తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
కేవలం 45 పైసలకే ఈ బీమా లభించడంతో ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందన్నారు. "ఐఆర్‌సీటీసీ వెబ్‌వైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకొనే పనిలేదు. ఈ ఆప్షన్ డిఫాల్ట్ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్కన్న తీసేయొచ్చు. దీనికోసం ఎటువంటి అదనపు దరఖాస్తు గానీ, పత్రాలు గానీ అవసరం లేదు అని మంత్రి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments