Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ట్రెండ్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్... ఎలాంటి ట్రెండ్ అయినా ట్రెండ్‌లో...

చెన్నై: రిలయన్స్ రిటైల్‌లో దుస్తులు, ఉప‌క‌ర‌ణాల‌ ప్ర‌త్యేక విభాగమైన ట్రెండ్స్‌.. తన బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ‘మహానటి’ కీర్తి సురేష్‌ను నియ‌మించుకున్న‌ట్లు వెల్ల‌డించింది. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కీర్తి సురేష్ ట్రెండ్స్‌కు ప్రచారకర్తగా వ్య

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (17:13 IST)
చెన్నై: రిలయన్స్ రిటైల్‌లో దుస్తులు, ఉప‌క‌ర‌ణాల‌ ప్ర‌త్యేక విభాగమైన ట్రెండ్స్‌.. తన బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ‘మహానటి’ కీర్తి సురేష్‌ను నియ‌మించుకున్న‌ట్లు వెల్ల‌డించింది. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కీర్తి సురేష్ ట్రెండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. ఈ కార్య‌క్ర‌మం చెన్నైలోని VR Mall ట్రెండ్స్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో గురువారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్‌పై ఏర్పాటు చేసిన ప్ర‌త్యేకమైన శాండ్ ఆర్ట్ ప్ర‌ద‌ర్శన ఆక‌ట్టుకుంది. అక్టోబర్ నుంచి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కీర్తి సురేష్ వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
 
ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ... “ఫ్యాష‌న్‌, ట్రెండ్స్ ఈ రెండింటినీ వేర్వేరుగా చూడ‌లేం. ట్రెండ్స్ బ్రాండ్‌కు దేశ‌వ్యాప్తంగా వినియోగ‌దారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక్క‌డ సామాన్య ధ‌ర‌ల‌కే అద్భుత‌మైన ఫ్యాష‌న్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కేల్‌.. బ్రాండ్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. భార‌త‌దేశ‌పు అతిపెద్ద ఫ్యాష‌న్ కేంద్రంగా ట్రెండ్‌ను పేర్కొన‌టం అతిశ‌యోక్తికాదు. 
 
ప్ర‌పంచ ఫ్యాష‌న్ రంగంలో వ‌చ్చే ఎలాంటి ట్రెండ్‌నైనా.. ట్రెండ్స్ మీకందిస్తుంది. బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ట్రెండ్స్‌తో క‌లిసి ప‌నిచేయ‌టం సంతోషంగా ఉంది. ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్న దుస్తులు, అన్ని ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులూ ప్ర‌త్యేకంగా ఉన్నాయి. ఇవ‌న్నీ అంత‌ర్జాతీయ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉన్నాయి. గెట్ దెమ్ టాకింగ్ పేరుతో ప్రారంభించిన ఈ ప్ర‌చారం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది’ అని అన్నారు.
 
ట్రెండ్స్ సీఓఓ, విపిన్ త్యాగి మాట్లాడుతూ.. ‘ట్రెండ్స్ నేడు భార‌త‌దేశంలో ఎక్కువ‌మంది ఫ్యాష‌న్ ప్రియులు కోరుకుంటున్న కేంద్రం. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ట్రెండ్స్ ఫ్యాష‌న్ కేంద్రంగా మారాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్ర‌జ‌లలు, ఫ్యాష‌న్ ప్రియుల‌ నుంచి ట్రెండ్స్‌కు అనూహ్యమైన స్పంద‌న వ‌స్తోంది. దీనికి అనుగుణంగానే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సేవ‌లందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వినియోగ‌దారుల‌తో మ‌రింత సుస్థిర అనుబంధం ఏర్ప‌ర్చుకొన‌టంలో కీర్తి సురేష్‌తో క‌లిసి ముందుకెళ్ల‌టం దోహ‌ద‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments