Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:34 IST)
పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు తాజాగా పెరిగిన ధరలతో ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 106.08 రూపాయలుగా నమోదైంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటి చాలా కాలమైంది. దేశంలో పెట్రోల్ ధర మొదటిసారి 100 రూపాయల మార్క్‌ను దాటింది కూడా రాజస్థాన్‌లోనే. అయితే శ్రీగంగాధర జిల్లాలో నమోదైన పెట్రోల్ ధర కంటే అవి తక్కువే. 
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 100కు పైగానే కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.3గా నమోదైంది. ఇక డీజిల్ ధర 93.35గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.09గా నమోదు కాగా, డీజిల్ ధర 86.01గా నమోదైంది.
 
వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.08, చెన్నైలో పెట్రోల్ రూ.96.23, డీజిల్ రూ.90.38, కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.76, డీజిల్ రూ.88.51, బెంగళూరులో పెట్రోల్ రూ.97.92, డీజిల్ రూ.90.81గా ఉంది.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments