Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెయిరీ పరిశ్రమలో నూతన యుగం: నాణ్యతా పరీక్షల కోసం సిద్స్‌ ఫార్మ్‌ నూతన పోర్టల్‌

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (19:18 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ తమ క్వాలిటీ పోర్టల్‌ను ప్రారంభించింది. భారతీయ పాల పరిశ్రమలో మొట్టమొదటిసారి ఇది.
 
సంపూర్ణమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన పాలు మరియు పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంలో ఆహార భద్రత, నాణ్యత అనేవి అత్యంత కీలకాంశాలు. ఈ పోర్టల్‌తో వినియోగదారులు సంబంధిత సమాచారం తెలుసుకోగలరు.
 
వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులపై క్యుఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఆ తేదీకి సంబంధించి నిర్ధిష్టమైన బ్యాచ్‌ ఫలితాలు పొందవచ్చు. ఈ పోర్టల్‌ ఆవిష్కరణ గురించి సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌- ఎండీ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మేమిక్కడ ప్రారంభించాము. తాము ప్రతి రోజూ వినియోగిస్తున్న పాలు సురక్షితమైనవేనా కాదా అని వినియోగదారులు తెలుసుకోగలరు. సిద్స్‌ ఫార్మ్‌ వద్ద మేము ఎల్లప్పుడూ వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తుంటాము. అసలైన ఫలితాలను వారితో  పంచుకోవడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడము’’ అని అన్నారు.
 
ఈ నూతనంగా విడుదల చేసిన పోర్టల్‌లో 15 కీలకమైన ఫలితాలు ప్రదర్శిస్తారు, ఈ15 పరీక్షలు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షల ద్వారా విష రసాయనాలు, కల్తీ,  యాంటీబయాటిక్స్‌, డిటర్జెంట్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, సోప్‌, సాల్ట్‌, స్టార్చ్‌, ఆల్కహాల్‌ పరీక్షలు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments