Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లీప్‌‌ను బలోపేతం చేయడానికి వాద్వానీ ఫౌండేషన్‌- మ్యాజిక్‌ బస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

Advertiesment
లీప్‌‌ను బలోపేతం చేయడానికి వాద్వానీ ఫౌండేషన్‌- మ్యాజిక్‌ బస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం
, గురువారం, 31 మార్చి 2022 (15:45 IST)
ఇప్పటికే 50వేల మందికి పైగా యువత జీవితాలలో పెనుమార్పులు తీసుకువచ్చిన మ్యాజిక్‌ బస్‌ యొక్క  యువత నైపుణ్యం, ఉద్యోగ నియామక కార్యక్రమం లీప్‌లో ప్లేస్‌మెంట్‌, నిలుపుదలకు సంబంధించిన తమ ప్రక్రియలను బలోపేతం చేయడానికి వాద్వానీ ఫౌండేషన్‌ మరియు వాద్వానీ క్యాటలిస్ట్‌ నేడు మ్యాజిక్‌ బస్‌తో మూడు సంవత్సరాల కాలం కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించాయి.

 
ఈ భాగస్వామ్యం గురించి సంజయ్‌ షా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, వాద్వానీ ఫౌండేషన్‌-ఇండియా/సౌత్‌ ఈస్ట్‌ ఆసియా మాట్లాడుతూ, ‘‘మ్యాజిక్‌ బస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల వాద్వానీ ఫౌండేషన్‌ చాలా ఆనందంగా ఉంది. వీరి లీప్‌ కార్యక్రమం వినూత్నమైనది, అత్యంత ప్రభావశీలమైనది. బీద వర్గాలకు చెందిన వేలాది మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటుగా వృద్ధి చెందుతున్న రంగాలలో కోరుకున్న ఉద్యోగాలను పొందేందుకు తోడ్పడింది. మార్పుకు వీరు తోడ్పాటునందించడంతో పాటుగా ఉద్యోగాధారిత ప్రభావం సృష్టిస్తున్నారు. వాద్వానీ పర్యావరణ వ్యవస్ధపై ఆధారపడి మ్యాజిక్‌ బస్‌కు సహాయపడటం ద్వారా వారి నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలకు తోడ్పడి మరిన్ని జీవితాలను స్పృశించాలనుకుంటన్నాము’’ అని అన్నారు.

 
మొట్టమొదటిసారిగా, ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన భాగస్వామ్యం గ్రాడ్యుయేషన్‌ అనంతరం మ్యాజిక్‌ బస్‌ విద్యార్థులు 21వ శతాబ్దపు జీవిత నైపుణ్యాలలో శిక్షణ పొందడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్‌, ఐటీ, ఐటీఈఎస్‌, అమ్మకాలు మరియు మార్కెటింగ్‌, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో ఆశావహ ఉద్యోగాలను  పొందేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, కుటుంబానికి సహాయపడ ఆదాయ స్ధాయిలలో కనీసం ఆరు నెలల పాటు వారికి నిరంతర ఉపాధినీ అందిస్తుంది.

 
ఈ ఫండింగ్‌ క్లోజర్‌ గురించి సిద్ధార్ధ్‌ దోండియాల్‌,  ఎగ్జిక్యూటివ్‌ వీపీ– వెంచర్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ అండ్‌  క్యాటలిస్ట్‌, వాద్వానీ ఫౌండేషన్‌ మాట్లాడుతూ ‘‘మ్యాజిక్‌ బస్‌తో మా భాగస్వామ్యం వాద్వానీ వ్యూహానికి ప్రేరకంగా ఉండటంతో పాటుగా భారతదేశంలో   భారీ స్ధాయిలో ఉద్యోగ కల్పన చేసే సామర్థ్యం మరియు నిబద్ధత కలిగిన సంస్థలను ప్రోత్సహించాలనే వాద్వానీ వ్యూహానికి ప్రతిరూపంగా ఉంటుంది. మ్యాజిక్‌బస్‌తో అతి సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

 
వాద్వానీ క్యాటలిస్ట్‌ ఫండింగ్‌, దాని లక్ష్యానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా గ్రాంట్‌ మద్దతు ద్వారా ప్రభావాన్ని వృద్ధి చేసి భారీ స్థాయిలో  ఉపాధి సృష్టి చేయనుంది. వాద్వానీ క్యాటలిస్ట్‌ ఇప్పుడు మ్యాజిక్‌ బస్‌, అత్యుత్తమ ప్రక్రియలను నిర్మించేందుకు తోడ్పడటంతో  ఆపటుగా ప్లేస్‌మెంట్‌ తరువాత విద్యార్ధులను సైతం ట్రాకింగ్‌ చేస్తూ ప్లేస్‌మెంట్‌ అనంతరం తగిన మద్దతునూ అందించనుంది.

 
వాద్వానీ క్యాటలిస్ట్‌తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల తన సంతోషాన్ని జయంత్‌రస్తోగీ, గ్లోబల్‌ సీఈఓ, మ్యాజిక్‌ బస్‌ వెల్లడిస్తూ ‘‘ఇది వినూత్నమైన, అత్యున్నత నైపుణ్య భాగస్వామ్యం. దీని ద్వారా 18-25 సంవత్సరాల వయసు కలిగిన యువతకు తగిన మార్కెట్‌ సంబంధిత నైపుణ్యాలను అందించడంతో పాటుగా కార్యక్షేత్రంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయడంతో పాటుగా స్ధిరమైనజీవనోపాధినీ కలిగి ఉంటారు. ఈ భాగస్వామ్యం, మరింతగా ప్రస్తుత పర్యావరణ వ్యవస్ధను మెరుగుపరిచేందుకు మ్యాజిక్‌ బస్‌కు తోడ్పడటంతో పాటుగా యువతను చైతన్యం చేసేందుకు మరియు ప్రభావాన్ని ట్రాక్‌ చేయడానికి ఓ శక్తివంతమైన సాంకేతికాధారిత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.

 
అరుణ్‌ నలవాడీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-సస్టెయినబిలిటీ అండ్‌ పార్టనర్‌షిప్స్‌, మ్యాజిక్‌ బస్‌ మాట్లాడుతూ, ‘‘ఈ భాగస్వామ్యం భారతదేశంలో నైపుణ్యాన్ని చూసే థృక్పథాన్ని సమూలంగా మార్చనుంది. ప్ల్లేస్‌మెంట్‌లపై ప్రోత్సాహం కొనసాగుతోంది మరియు యువకుల నిలుపుదల, కెరీర్‌ పరివర్తనసై తక్కువ దృష్టి ఉంది. ఈ నిధుల మద్దతుతో  అభివృద్ధి రంగంలో కీక్వాలిటీ ప్లేయర్‌గా ఉద్భవించే అవకాశాన్ని అందిస్తుంది మరియు ఈ భాగస్వామ్యం నుంచి ఇతరులు నేర్చుకోవడానికి, ప్రతిబింబించేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nimbooz నిమ్మరసమా..? పండ్ల రసమా? సుప్రీంకు పంచాయతీ