Publish Date: Thu, 31 Mar 2022 (09:26 IST)
Updated Date: Thu, 31 Mar 2022 (09:27 IST)
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే, గురువారం బులియన్ మార్కెట్ వివరాల మేరకు పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా నేల చూపు చూస్తున్న బంగారం ధరలు మూడో రోజైన గురువారం కూడా తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు పెద్ద ఊరటినిచ్చే విషయం.
అయితే దేశీయంగా బంగారం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు అనేక కారణాలను వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వు, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి.
గురువారం నాటి వివరాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో మార్చి 31 వ తేదీ 2022 గురువారం రోజున బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.120 మేర తగ్గి రూ.51,980లుగా కొనసాగుతుంది. ఇవే పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కొనసాగుతున్నాయి.