Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ హంట్‌‌ను నిర్వహించబోతున్న షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (20:27 IST)
షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌, ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ హంట్‌తో 2023ను ప్రారంభించింది. దీనిద్వారా భారతదేశవ్యాప్తంగాఆధీకృత, వినూత్నమైన డిషెస్‌ను తయారుచేస్తూనే తమ ప్రాంతీయ క్యుసిన్‌లను అత్యంత అందంగా ప్రదర్శించే హోమ్‌ కుక్స్‌ను గుర్తించనున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో వండిన ఆహారానికి ప్రాధాన్యతనిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే మరేదీ అందించలేనటువంటి సౌకర్యం మరియు ఆనందం అందిస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని,  షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ ఇప్పుడు హోమ్‌కుక్డ్‌ ఫుడ్‌ను తమ మెనూలో భాగంగా చేసింది. ఎనిమిది విభిన్న ప్రాంతాలకు చెందిన క్యుసిస్‌లతో ఎనిమిది మంది హోమ్‌ కుక్‌లను ఒకే గూటికి ఈ ఇండియన్‌ కలినరీ ట్రెజర్‌ హంట్‌ ద్వారా తీసుకురానుంది.
 
ఎఫ్‌ అండ్‌ బీలో ఆవిష్కరణ పరంగా సుప్రసిద్ధమైన చెఫ్‌ మరియు మాస్టర్‌ చెఫ్‌ తెలుగు సీజన్ -1 న్యాయనిర్ణేత మహేష్‌ పడాల, ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈయనతో పాటుగా  ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సంజయ్‌ రావత్‌, సుప్రసిద్ధ భారతీయ ఫుడ్‌ విమర్శకుడు సంకల్ప్‌ విష్ణులు ఈ పోటీలో హోమ్‌ కుక్స్‌ను గుర్తించనున్నారు. ఈ పోటీల ముగింపులో భాగంగా ఈ హోమ్‌ కుక్స్‌తో షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌లోని ఫీస్ట్‌ రెస్టారెంట్‌లో తమ రుచులను చవిచూపనున్నారు.
 
షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ జీఎం ప్రణయ్‌ వెర్డియా మాట్లాడుతూ ‘‘ఈ 2023లో హైదరాబాద్‌లో  స్ధానికులతో పాటుగా అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా  సమావేశమయ్యే అత్యుత్తమ వేదికగా నిలువాలన్నది షెరటన్‌ లక్ష్యం. దేశవ్యాప్తంగా హోమ్‌ కుక్స్‌కు ఓ వేదికను అందించడానికి మించిన అత్యుత్తమ మార్గమేముంటుంది? మనమంతా మన కుటుంబ సభ్యులు మన కోసం ప్రేమ, అభిమానంతో వంట చేయడ చూసి ఉంటాము. వారికి వనరులు పరిమితంగా ఉంటాయి కానీ వారు తమ ప్రియమైన వారికి వంట చేస్తుంటారు కాబట్టి ఆ ఆహారం అత్యంత రుచికరంగా మారుతుంది. షెరటన్‌ వద్ద , మేము ఈ ప్రేమ, అభిమానాన్ని మా కమ్యూనిటీ పట్ల ఈ ఇండియన్‌ కలినరీ ట్రెజర్‌ ద్వారా చూపాలనుకుంటున్నాము. ఈ మొత్తం కార్యక్రమం మా బ్రాండ్‌ యొక్క లక్ష్యం ‘ద వరల్డ్స్‌ గేదరింగ్‌ ప్లేస్‌’కు అనుగుణంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాలకు చెందిన 8 మంది హోమ్‌ కుక్స్‌ ఈ కార్యక్రమంలో  పాలుపంచుకోగలరు. ఈ కార్యక్రమానికి నిపుణులతో కూడిన బృందమైన మహేష్‌ పడాల, సంకల్ప్‌ మరియు ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సంజయ్‌ రావత్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు’’అని అన్నారు.
 
ఫుడ్‌ అండ్‌ బేవరేజస్‌ క్లస్టర్‌ డైరెక్టర్‌, చెఫ్‌ మహేష్‌ పడాల మాట్లాడుతూ ‘‘తినడం అనేది  శరీరం కంటే మనసుకు సంబంధించిన అంశం’ అనే  లియాన్‌ రాప్పోపోర్ట్‌ చెప్పిన విషయాన్ని బలంగా నమ్ముతుంటాను. ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ ద్వారా హోమ్‌ కుక్స్‌  సిద్ధం చేసిన భారతీయ ప్రాంతీయ వంటకాల అందాన్ని ప్రదర్శించనున్నాము.  ఆహారం, భావొద్వేగాల కలయిక మరియు సంబంధాలను ఒడిసిపడుతుంది. మానసికంగా మరియు శారీరకంగా శక్తివంతం చేయడంలో ఆహారం తోడ్పడుతుందని మేము నమ్ముతుంటాము, అంతేకాదు అది మనకు పునరుత్తేజమూ కలిగిస్తుంది. ఇంటిలో అమ్మ ప్రేమతో తీర్చిదిద్దే రుచులను కమర్షియల్‌ కిచెన్‌ల ద్వారా పునః సృష్టించడం కష్టం. అయినప్పటికీ మేము వీలైనంతగా ఆధీకృత రుచులను అందించడానికి ప్రయత్నిస్తున్నాము.  దేశవ్యాప్తంగా 8మంది హోమ్‌ కుక్స్‌ను ఒకే చోట తీసుకురావడమనేది వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉంది మరియు ఈ కార్యక్రమం ద్వారా హోమ్‌ కుక్స్‌ను కలుసుకోవడంతో పాటుగా ఆధీకృత వంటకాల రహస్యాలను తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది’’ అని అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ‘‘ ఫాస్ట్‌ ఫుడ్‌ను పొందడం చాలా సులభం. చాలా కుటుంబాలు హోమ్‌కుకింగ్‌లోని ఆనందాన్ని కోల్పోతున్నాయి. కానీ పోషకాహార మరియు సామాజిక కారణాల దృష్ట్యా  మన సంప్రదాయ హోమ్‌ వంటకాలకు తిరిగి రావడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments