Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ ధరలు పెంపు-బీర్ ప్రియులు జేబులకు చిల్లు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:35 IST)
బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్ ప్రియులు జేబులకు చిల్లు పడనుంది. బీర్ తయారీ కంపెనీలు రేట్లను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. బీర్ల తయారీలో వినియోగించే బార్లీ రేట్లతో పాటు ఇతర ముడి పదార్థాల రేట్ల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
 
బీర్ తయారీలో కీలకమైన బార్లీ ధరలు గత సంవత్సరం కాలంలో 65 శాతం మేర పెరిగాయి. వీటికి తోడు డిస్టిలరీ కంపెనీలు పెరుగుతున్న రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
 
దేశంలో బీర్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు బీర్ రేట్లను పెంచాయి. మరిన్ని రాష్టాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.
 
సహజంగా వేసవి కాలమైన మార్చి నుంచి జులై మధ్య కాలంలో ఏడాది మెుత్తం అమ్మకాల్లో 40 నుంచి 45 శాతం సేల్స్ జరుగుతుంది. ఈ తరుణంలో రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం అమ్మకాలపై పడనుందని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments